Breaking : గాలి జనార్థన్‌ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌

-

కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్‌లో మార్పులు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించిన గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇదివరకే విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఇవ్వాళ తన నిర్ణయాన్ని వెల్లడించింది సుప్రీంకోర్టు.

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ ఆయనకు ఇదివరకే మంజూరయింది. ఇందులో మార్పులు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version