టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణకు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు, గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాల నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేట్లు తగ్గించలేదని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. సినిమా రిలీజ్ సమయంలో పన్ను రాయితీ తీసుకుని.. టికెట్ రేట్లు ఎందుకు తగ్గించలేదని.. అలాగే పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు.. బాలకృష్ణతో సహా అప్పటి తెలంగాణ, ఏపీ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటిసులు పంపించింది.
ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు హయాంలో ఇలా సినిమాలకి పన్ను రాయితీలు ఇచ్చారని.. కానీ వారు మాత్రం ఆ రాయితీలను జనాలకి బదలాయించకుండా వాళ్ళ దగ్గర దోచుకున్నారని.. అందుకే సినీ ఇండస్ట్రీ బాబుకి వత్తాసు పలుకుతోందన్నది పిటిషనర్ ఆరోపణ.. బాలకృష్ణ కెరీర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ హిట్స్ లో గౌతమీ పుత్ర శాతకర్ణి ఒకటి.. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా
ఉండడం.. సొంత బావ అయిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం.. తెలంగాణ ప్రభుత్వంతో.. టాలీవుడ్ కు సత్సంబంధాలు ఉండడం.. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు నేలపై జరిగిన చరిత్రాత్మక సినిమా అని ప్రచారం చేసుకోవడంతో.. ఈ సినిమాకు అప్పటి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పించాయి.