రెండో పెళ్లిపై మాట్లాడిన సురేఖ.. అలాంటి బాయ్​ఫ్రెండ్​ కావాలంటూ..

-

తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించారు నటి సురేఖా వాణి. ఇప్పుడు కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా.. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్​గా ఉంటున్నారు. కూతురు సుప్రితతో కలిసి లైఫ్​ను సరదాగా గడుపుతూ.. వాటికి సంబంధించిన పోస్ట్​లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే సుప్రిత బర్త్‌ డే సెలబ్రేషన్స్​లో సోషల్ మీడియాలో తెగ వైరల్​ అయింది. తల్లికూతురులిద్దరూ చిల్​ కొడుతూ ఫుల్​ ఎంజాయ్​ చేశారు. దీనిపై ట్రోల్స్​ కూడా వచ్చాయి.

అయితే 38 ఏళ్లకే భర్తను పోగొట్టుకొన్న సురేఖ.. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుందని కొంత కాలం క్రితం పలుసార్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తల్లి కూతురిలిద్దరూ ఈ విషయమై మాట్లాడారు. యాంకర్​ అడిగిన ప్రశ్నలకు సరదా సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు.

‘త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?’ అంటూ యాంకర్​ అడగగా.. అందుకు సురేఖ, సుప్రిత చెప్పిన సమాధానం వైరల్​గా మారింది. సురేఖ నో అనే బోర్డు చూపించగా.. సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డు చూపించింది. అంతేకాకుండా ‘చేసేద్దాం సింగిల్​గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది’ అంటూ కామెంట్‌ చేసింది. సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం ప్రస్తుతానికి లేదని చెప్పింది. భవిష్యత్​లో ఏమైనా జరగొచ్చు అంటూ సమాధానం చెప్పారు.

‘మీరిద్దరూ సింగిలేనా?’ అంటూ తల్లీకుమార్తెలను మరోసారి ప్రశ్నించగా.. ఇద్దరూ అవునని చెప్పారు. ఎలాంటి బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని కోరగా.. ‘నన్ను భరిస్తే చాలంటూ’ సుప్రిత సమాధానం చెప్పింది. సురేఖ మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్‌ క్వాలిటీస్​ను రివీల్​ చేశారు. 6 ఫీట్‌ హైట్‌ ఉండాలి, మంచి కలర్‌, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్​గా గడ్డం ఉంటాలి అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news