ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి ఈమధ్య సినిమాలకంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా తన కూతురితో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వీడియోలు కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . ఇది ఇలా ఉండగా సినిమాలలో తల్లి, కోడలు, భార్య ఇలా రకరకాల క్యారెక్టర్లలో నటిస్తూ మెప్పిస్తూ తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఒక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి హీరోయిన్ వయసు ఉన్న కూతురుతో సమానంగా గ్లామర్ వొలకబోస్తూ తగ్గేదేలే అన్నట్టుగా హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతూ ఉంటుంది.
ఇకపోతే రెండవ పెళ్లి కి దూరం అని చెప్పిన, ఈమె భర్త కంటే బాయ్ ఫ్రెండ్ అవసరం చాలా ఉంది అని చెబుతోంది. ఇక ఆ బాయ్ ఫ్రెండ్ కి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలని కూడా చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా సురేఖ వాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.