బాబుకు రోజు రోజుకీ సానుభూతి పెరుగుతుంది కానీ…!!

-

కరోనా కష్టకాలంలో “స్టే హోం స్టే సేఫ్” ని అత్యంత శ్రద్ధగా పాటిస్తూ తన వయసు వారికందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబుపై రోజు రోజుకీ సానుభూతి పెరిగిపోతుందంట! ఈ సందర్భంగా కేంద్రంలోని పెద్దలతో చంద్రబాబుని పోలిస్తూ.. అర్ధం చేసుకోవాలని అంటున్నారంట! అయితే… బాబుకు సానుభూతి పెరుగుతుంది కానీ.. చినాబాబుకు మాత్రం వాయింపులు పెరిగిపోతున్నాయి!

అవును… కరోనా సమయంలో చంద్రబాబు బయటకు రావడం లేదు అంటే… ఆయనకున్న వయసు, ఆరోగ్య సమస్యలు అని అర్ధం చేసుకుని, సానుభూతి ప్రకటిస్తున్నారంట కొందరు తమ్ముళ్లు! అయితే… ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే బాబు కొంపలో ఉన్నా ఏపీని కదిలించగల కేడర్ ఉంది! కానీ ఇక్కడున్న సమస్య ఏమిటంటే… అందొస్తాడనుకున్న కొడుకు అసమర్ధుడిగా మిగిలిపోవడమే! దీంతో… సోనియా గాంధీ – రాహుల్ గాంధీలను ఉదాహరణలుగా చూపిస్తున్నారంట టీడీపీ కార్యకర్తలు, బాబు అభిమానులు!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో హత్యాచారాలు.. కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్ట‌డాన్ని దేశం మొత్తం చూస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయ‌కులు రాహుల్ ‌గాంధీ, ప్రియాంక గాంధీలు పోరాటాలు దేశ‌మంతా వీక్షిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్యం రీత్యా ఇంటి వ‌ద్ద‌ ఉంటూనే.. త‌న పిల్ల‌ల‌ను పంపడాన్ని ఆమెకున్న చిత్తశుద్ధిగా చెబుతున్నారు విశ్లేషకులు!

మరి పొద్దున్న లేస్తే రాష్ట్రంలో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని అరిచి గీపెడుతున్న బాబు… తాను స్టే హోం స్టే సేఫ్ అనుకున్నా, సరే పెద్దాయన వయసు రీత్యా రిస్క్ తీసుకోలేకపోతున్నారని సరిపెట్టుకున్నా.. లోకేష్ ను ఎందుకు పంపడం లేదనేది ఇక్కడ ప్రశ్న! అంటే… బాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవా.. లేక చినబాబు ఇంట్లోనే ఉంటాడు.. కార్యకర్తలు పల్లకి మోస్తే అప్ప్డు వచ్చి కుర్చుంటాడు అని చెప్పబోతున్నారా?

కాబట్టి… ఇప్పటికైనా సోనియాను ఆదర్శంగా తీసుకుని లోకేష్ ను కూడా జనాల్లోకి పంపాలని కోరుకుంటున్నారంట టీడీపీ కార్యకర్తలు! మరి బాబు వారి మాటలు వింటారా లేక పట్టించుకోకుంటారా అనేది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news