దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో రాష్ట్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే అక్కడి ప్రజ్జలు కరోనాతో ఇబ్బంది పడకుండా ఉండటానికి గానూ… రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు 4 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక సరిహద్దు రాష్ట్రాల విషయంలో కఠినంగా వ్యవహరించే ఆలోచనలో ఉన్నారు. ఎల్లుండి నుంచి 2 వారాల పాటు లాక్ డౌన్ అమలు కానుంది.