తెలంగాణలో కరోనా టెన్షన్ రేపుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా టెన్షన్ నెలకొంది. దీంతో తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల కు ఫోన్ చేసి గవర్నర్ వివరాలు తెలుసుకున్నారు.
ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించినట్టు చెబుతున్నారు. అలానే తెలంగాణ వైద్యారోగ్య శాఖ రూపొందించిన కొత్త యాప్ గురించి మంత్రిని గవర్నర్ అడిగి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. తాజాగా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1321 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి చేరింది. ఇందులో 3,02,500 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 7,923 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.