సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఎన్నిక

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ పదవిని చేపట్టడం తమ్మినేని వీరభద్రానికి ఇది మూడో సారి. కాగా.. 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక కూడా తాజాగా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్‌ ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3 వ మహాసభలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. మొదటగా… రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్‌ వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్‌ ల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరి క్షణంలో.. తమ్మినేని వీర భద్రానికే పగ్గాలు లభించాయి. దీంతో మిగతా వారికి నిరాశ మిగిలింది. ఇక ఈ పదవీ రావడంపై తమ్మినేని వీర భద్రం హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ పదవి దక్కుతుందని అనుకోలేదని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.