రూ.5 లక్షలు ఆదా చెయ్యాలంటే.. మార్చి 31లోపు ఇలా చెయ్యండి..!

-

డబ్బులని సేవ్ చేసుకోవాలని ఎవరికి ఉండదు..? ఎవరైనా సరే డబ్బులు వృధాగా పోకూడదని చూస్తారు. అయితే మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ మధ్య కాలం లో చాలా మంది హోమ్ లోన్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు.

homeloan
homeloan

హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తే మీకు పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు అయితే తక్కువ వడ్డీకే లభిస్తున్నాయి. మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ మాత్రమే కాకుండా మరి కొన్ని బ్యాంకులు కూడా హోమ్ లోన్స్ ని ఇస్తున్నాయి. కనుక ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే చౌక వడ్డీ రుణం పొందొచ్చు.

అలానే హోమ్ లోన్ తీసుకుంటే ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ ని కూడా పొందొచ్చు. మొత్తంగా అయితే రూ. 5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24బీ, సెక్షన్ 80సీ, సెక్షన్ 80ఈఈఏ వంటి వాటి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు.

వీటన్నింటి ప్రకారం చూస్తే ఐదు లక్షల ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు మినహాయింపు, సెక్షన్ 24బీ కింద రూ.2 లక్షలు మినహాయింపు ఉంటుంది. 80ఈఈఏ కింద రుణ వడ్డీ మొత్తంపై మరో రూ.1.5 లక్షల వరకు అదనంగా పన్ను మినహాయింపు కూడా.

మార్చి 31 వరకే ఈ ప్రయోజనం వుంది. సెక్షన్ 80ఈఈఏ కింద అదనపు పన్ను మినహాయింపు కావాలనుకుంటే కొనుగోలు చేసే ఇంటి విలువ రూ.45 లక్షలు దాటకూడదు గమనించండి. అలానే ఇంటిని కొనుగోలు చేసిన దగ్గరి నుంచి ఐదేళ్ల వరకు విక్రయించకూడదు మరియు ఇతర ప్రాపర్టీస్ కూడా వుండకూడదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news