వారసులు రె’ఢీ’..గెలుపు బాటలో వెళ్లేదెవరు?

-

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత పెరుగుతుంది..రాబోయే తరం నాయకులుగా వారు ఎన్నికల బరిలో దిగడం మొదలుపెట్టారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో యువ నేతలు అంటే..సీనియర్ నేతల వారసులు అనే పరిస్తితి. అలా నాయకుల వారసులు మాత్రమే రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో చాలామంది నేతల వారసులు బరిలో దిగి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. అయితే టి‌డి‌పి నుంచి బరిలో దిగిన రాజకీయ వారసులు ఓటమి పాలయ్యారు.

వైసీపీ నుంచి కొందరు విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కొందరు నేతల వారసులు బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టి‌డి‌పి నేతల వారసులు..మళ్ళీ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. పరిటాల వారసుడు శ్రీరామ్, గౌతు ఫ్యామిలీ వారసురాలు శిరీష, బాలయోగి వారసుడు హరీష్, కాగిత వెంకట్రావు వారసుడు వారసుడు కృష్ణప్రసాద్., బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్..ఇలా కొందరు నేతలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి వారు ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరిశీలించుకొనున్నారు.

అయితే వైసీపీలో సైతం కొందరు వారసులు బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే జగన్ అందరి వారసులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ప్రస్తుతానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడు మోహిత్ రెడ్డి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఆయనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని వారసుడు పేర్ని కృష్ణమూర్తికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వారసుడు సైతం పోటీ చేయాలని చూస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరుల వారసులు సైతం పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం వారసుడు సైతం నెక్స్ట్ పోటీ చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి జగన్ ఏ వారసులకు ఛాన్స్ ఇస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news