హైకోర్టు తీర్పుతో టీడీపీ ఇరకాటంలో పడిందా

-

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది.ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా దాన్ని ఆమోందించిన కోర్టు మొత్తం నోటిఫికేషన్ ను రద్దు చేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని స్వాగతించిన టీడీపీ నోటిఫికేషన్ రద్దు తో కాస్త ఇరాకటంలో పడినట్లేన అన్న చర్చ నడుస్తుంది.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని టిడిపి స్వాగతించింది. కోరోనా ఎలా అడ్డు వస్తుందంటూ నిమ్మగడ్డ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భయపడుతుందంటూ సవాళ్లు విసిరింది. అయితే ఇప్పుడు ఎస్ఈసీ నిర్ణయం పై కోర్టు తీర్పుపై టీడీపీ ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిపోయింది. ఎన్నికలను స్వాగతిస్తున్నాం అని చెప్పిన టీడీపీ నేతలు దీని పై సమాధానం ఇవ్వలేని స్థితిలోకి వెళ్లిపోయారు.

స్థానిక ఎన్నికల విషయంలో అధికార ప్రతిపక్షాల మద్య పెద్ద యుద్దమే జరుగుతుంది. వ్యక్తులు ఆధారంగా వ్యవస్థలు పని చేస్తున్నాయి అంటూ ఇరు వర్గాలు ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విషయంలో నిమ్మగడ్డ దూకుడును టిడిపి స్వాగతించగా..ప్రభుత్వం, ఉద్యోగులు, అదికారులు అడ్డు చెప్పారు. ఇప్పుడు కోర్టు నోటిఫికేష్ రద్దు చెయ్యడంతో వారి వాదనే కరెర్ట్ అయినట్లు అయ్యింది. సంక్షేమ పథకాలు అమలు కాకుండా నిత్యం నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుంటున్నారని వైసీపీ నిత్యం టిడిపి పై ఆరోపణలు చేస్తుంది. తాజా నోటిఫికేష్ వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందంటూ వైసిపి చెప్పుకొస్తోంది. దీంతో ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చిన టిడిపి ఇప్పుడు ఇరకాటంలో పడింది.

టీడీపీ సంబంధం లేకున్నా నిమ్మగడ్డ చర్యలు రాజకీయంగా కూడా పార్టీకి ఇబ్బందులు సృష్టించాయి. తాజా పరిణమాలతో ఏమీ మాట్లాడలేని స్థితికి టిడిపి వెల్లిపోయింది. అయితే ఈ మొత్తం గొడవలో బీజేపీ సేఫ్ గానే ఉంది. ఎన్నికలకు సిద్దం అంటూ మాత్రమే బిజెపి ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంది. దీంతో బిజెపి ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఈ ఎపిసోడ్ నుంచి బయట పడింది. మొత్తంగా చూసుకుంటే కోర్టు తీర్పుతో ప్రధాన ప్రతిపక్షం కొంత సంకట స్థితిని ఎదుర్కొంటుంది. అధికార పక్షానికి ఈ తీర్పు ఊపు నిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news