టీడీపీలో తీవ్ర విషాదం..కరోనాతో మాజీ మంత్రి మృతి

ఏపీలో ప్రతిపక్ష టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా వైరస్ ఒక మాజీ మంత్రి, సీనియర్ నేతను పొట్టన పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నడకుదిటి నరసింహారావు కరోనాతో పోరాడుతూ కన్ను మూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు.

కొద్ది రోజుల నుండి చికిత్స పొందుతున్న ఆయన  ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. బాబు హయాంలో నరసింహారావు మంత్రిగా పనిచేశారు. గతంలో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక, ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పిల్లనిచ్చిన మామ. అల్లుడిని రాజకీయాల్లోకి దింపిన ఆయన రెస్ట్ మోడ్ లోకి వెళ్లారు. అనూహ్యంగా కరోన సోకడంతో ఆయన మరణించారు.