అధికారపిచ్చితో జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు : బొండా ఉమ

-

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు, సీఎం జగన్ తనకున్న అధికార దురాశతో వ్యవస్థలన్నిటిని బ్రష్టుపట్టిషున్నారని మండిపడ్డారు . వ్యవస్థలని నాశనం చేసి అధికారకాంక్షలు చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ. ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓట్లు నమోదు చేయించి అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యార్హత ఇంటర్మీడియట్ అని చూపిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పట్టభద్రుల ఎన్నికలలో ఓటర్లు ఎలా అయ్యారని ప్రశ్నించారు ఉమ. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఉపఎన్నికలో దొంగఓట్లతో గెలిచిన జగన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ పట్టభద్రుల్ని నమ్ముకున్నారన్నారు.

వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చింది కాబట్టే.. అనంత ఎస్పీతో మాట్లాడించారు : బొండా  ఉమ | Manalokam

బోగస్ ఓట్లు, నకిలీ ఓటర్లు, డబ్బు, మద్యంతోనే జగన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తారని, ఎగతాళి చేశారు. దొంగఓట్ల నమోదులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు భాగస్వాములైనా రాష్ట్రఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అడిగారు. దొంగఓట్ల తంతులో భాగస్వాములైన అధికారులు, తాయిలాలకు ఆశపడి ఓటర్లుగా నమోదైనవారి వివరాలన్నీ తమవద్ద ఉన్నాయన్నారు. జగన్ కాపాడతాడనో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి రక్షిస్తారనో దొంగఓట్లు వేయడానికి నకిలీ పట్టభద్రులు వస్తే, వారిని జైలుకు పంపిస్తామని మండిపడ్డారు. అధికారపార్టీ అండతో రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న దొంగఓట్ల క్రతువుపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news