టీడీపీ నేత నరేంద్ర ధూళిపాళ్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ పై దుష్ప్రచారం చేస్తోందని ధూళిపాళ్ల మండిపడ్డారు . దీనిపై కీలక డాక్యుమెంట్లు విడుదల చేసినట్లు నరేంద్ర వెల్లడించారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో 5 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పంద పత్రాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో గుజరాత్ సర్కార్‌తో సీమెన్స్, డిజైన్ టెక్ చేసుకున్న ఒప్పందం పత్రాల వివరాలను విడుదల చేశానని నరేంద్ర చెప్పారు. మరోవైపు శుక్రవారం రోజు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. నలుగురు కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ మనీలాండరింగ్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ దాఖలు చేపట్టింది.
ఈ నెల మొదటి వారంలోనే నలుగురిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. మార్చి 4న నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వైజాగ్ జైల్లో నిందితులు ఉన్నారని, నిందితుల కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. నిందితుల తరపున వాదించేందుకు ఢిల్లీ, కలకత్తా, ముంబై నుంచి న్యాయవాదులు వచ్చారు. విచారణ సోమవారానికి వాయిదా వేసినట్లు న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ రెండోవ రోజు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు విచారణ పూర్తికావడంతో శ్రీకాంత్ ఢిల్లీ వెళ్లడం జరిగింది.