రాజధాని అమరావతిని తరలించ కూడదని గత నెలరోజులకు పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళనలు నిరసనలు చేస్తూ జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అసెంబ్లీ సమావేశాలలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడంతో తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కొత్త కోరిక తెరపైకి తీసుకువచ్చారు.
మేటర్ లోకి వెళ్తే అమరావతిలో రాజధాని కొనసాగిస్తూ విశాఖను ఆర్థిక రాజధానిగా అదేవిధంగా సినిమా రాజధానిగా ప్రకటించాలని కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. కేవలం విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని అనే అంశాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ నేతలు తెరపైకి తీసుకువచ్చిన విశాఖ ఆర్థిక రాజధాని అదేవిధంగా సినిమా రాజధాని అనే ప్రతిపాదనలు జగన్ దృష్టికి వెళ్తే ఓకే చెప్పే అవకాశం ఉందని ఆల్రెడీ జగన్ దృష్టిలో విశాఖపట్టణంలో సినిమా రంగం అభివృద్ధి చెందే దిశగా ఎప్పటినుండో సినిమారంగ పెద్దల చేత మంతనాలు చేసినట్లు దీంతో తాజాగా తెరపైకి టీడీపీ తెచ్చిన ప్రతిపాదనకు జగన్ సరే అని చెప్పే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మరి విశాఖలో పరిపాలన రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన విషయంలో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.