ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, జనసేన పార్టీలు అనైతిక కలయికలో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ రెండూ పార్టీలు ఉమ్మడిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది అన్నారు.సజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, జనసేన కలిస్తే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు అనేదే ప్రశ్న అని అన్నారు. గతంలో మాదిరి చంద్రబాబు ను సీఎంగా ప్రకటిస్తారా లేదా కొత్తగా పవన్ ని ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. ఇద్దరికిద్దరూ తామే సీఎం అభ్యర్థిమని ప్రకటించుకుంటున్నారు అని గుర్తు చేశారు.
2014లో బిజెపి తో పాటు ఆ రెండు పార్టీలు ఉమ్మడి గా పోటీ చేశాయన్నారు. 2019లో విడిపోయినట్లు నటించాలని విమర్శించారు. 2024లో వారు ఉమ్మడిగా పోటీ చేయడంపై తమకు ఏమీ ఆశ్చర్యం లేదని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉందని.. అప్పుడే పొత్తులపై తొందర ఎందుకని టిడిపి, జనసేన లను సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారని ఆయన విమర్శించారు.వారు అవసరమైతే కేఎపాల్ పార్టీతోను పొత్తు పెట్టుకుంటారని వ్యాంగ్యంగా విమర్శించారు సజ్జల.