ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార విపక్షాల మత విమర్శలు క్రమంగా పెరుగుతున్నాయి. వరుస ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై అధికార పార్టీ టార్గెట్ గా విపక్షం ఆరోపణలు చేస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి జీ పై మాజీ మంత్రి బండారు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇటీవల రిషికేశ్ వెళ్లిన స్వామీజీ ఏం మతం వారు ఇచ్చిన విమానాల వెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్న స్వామీజీల పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు. స్వామీజీ నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన అన్నారు. శారదా పీఠం పార్టీ కార్యాలయంగా మారిందని, స్వరూపానంద వైసిపి స్వామి గా మారిపోయారని అన్నారు.