ఇప్పటివరకు అధికార వైసీపీ రాజకీయాలకు ప్రతిపక్ష టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది. ఎక్కడ కూడా టిడిపి కోలుకోలేని పరిస్తితి..ఒకవేళ కోలుకునే పరిస్తితి ఉంటే..వెంటనే అధికార బలాన్ని వాడి వైసీపీ..టిడిపిని మళ్ళీ దెబ్బకొడుతూ వచ్చింది. ఇలా ఇప్పటివరకు వైసీపీ గేమ్ లో టిడిపి బలి అవుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో సీన్ రివర్స్ అవుతూ వస్తుంది.
ఎప్పుడైతే టీడీపీకి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం దక్కిందో..అప్పటినుంచి సీన్ మారిపోయింది. అదే సమయంలో టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. అది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గేమ్ మొదలుపెట్టింది..అప్పుడే 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వైసీపీకి అసలు కౌంటర్ ఇప్పుడు మొదలైందని టిడిపి నేతలు చెప్పారు. ఇక ఆ ఎన్నికలో 16 మంది కాదు గాని..4 గురు ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటు చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు.
అక్కడ నుంచి వైసీపీ ఆలోచనలో పడింది..పైకి తమకు నష్టమేమీ లేదన్నట్లు కవర్ చేసుకొస్తుంది గాని..లోలోపల మాత్రం టెన్షన్ పడుతుంది. ఎందుకంటే వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. దీనికితోడు ఇంకా తమతో చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు గేమ్ ఆడేస్తున్నారు.
దీనికి తోడు..ముందస్తు ఎన్నికలు అంటూ ఒక ప్రచారం వచ్చింది. వ్యతిరేకతకు భయపడి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ మైండ్ గేమ్ కూడా టిడిపి మొదలుపెట్టిందే అని తెలుస్తోంది. అదే సమయంలో పలువురు మంత్రుల పనితీరు బాగోలేదని అందుకే జగన్ నలుగురు, ఐదుగురు మంత్రులని మార్చేస్తారని, మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ప్రచారం వచ్చింది. ఇందులో కూడా టిడిపి గేమ్ ఉందని తెలుస్తోంది. అయితే ఇవేమీ జరిగేలా లేవు..కానీ టిడిపి మైండ్ గేమ్ ఆడి..వైసీపీని ఇరుకున పెడుతుందనే చెప్పాలి.