ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి… తెలుగుదేశం పార్టీ సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. అంతేకాదు స్పీకర్ పై కాగితాలు చింపి వేశారు.
అంతటితో ఆగకుండా సభలో గందరగోళం సృష్టించారు టిడిపి సభ్యులు. దీంతో ఆగ్రహానికి గురైన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం… టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ… కీలక ఆదేశాలు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని.
ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తం టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్న నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, స్వామి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.