నేడు ఖమ్మంలో TDP భారీ సభ.. పాల్గొననున్న చంద్రబాబు

-

ఖమ్మం గుమ్మంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని బలోపేతంగా చేయడమే లక్ష్యంగా ఇవాళ సభ నిర్వహిస్తున్నారు. నిర్వహించే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్న టీడీపీ.. లక్ష మందిని తరలించేలా ప్రణాళికలు చేస్తోంది.

పార్టీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో జయప్రదం చేసేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరమంతా టీడీపీ జెండాలు, ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను అత్యధిక సంఖ్యలో తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు చీరలు ధరించి సభలో పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news