ఫ్యాన్ కోటల్లో సైకిల్ రైడర్లు ఫిక్స్?

-

ఏపీ రాజకీయాల్లో సైకిల్ పార్టీ స్పీడ్ పెరుగుతుంది..ప్రతిపక్షంలో ఉంటూ అధికార వైసీపీని పూర్తి స్థాయిలో ఎదురుకోవడానికి రెడీ అవుతుంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. గత ఎన్నికల్లో చేసిన తప్పులని మళ్ళీ రిపీట్ చేయకూడదని చూస్తుంది. ఈ సారి ఖచ్చితంగా అధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంతో టీడీపీ కొత్త ఊపు వచ్చింది. మహానాడు పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో…ఇంకా ఎక్కడ తగ్గకుండా పనిచేసి..పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాలని టార్గెట్ చేసి చంద్రబాబు ముందుకెళుతున్నారు..వైసీపీ కంచుకోటల్లో సైకిల్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. వైసీపీ కంచుకోటలని సైతం బద్దలగొట్టి అధికారం దక్కించుకోవాలని బాబు భావిస్తున్నారు. అందుకే వైసీపీ కంచుకోటల్లో బలమైన నాయకులని నిలబెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ అభ్యర్ధులు దూకుడుగా పనిచేస్తూ ముందుకెళుతున్నారు.

మొదట నుంచి మాచర్ల నియోజకవర్గం టీడీపీకి అనుకూలమైనది కాదు..ఇది పూర్తిగా వైసీపీ కంచుకోట..ఇంకా చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా…గత నాలుగు ఎన్నికల నుంచి మాచర్లలో పిన్నెల్లి గెలుస్తూ వస్తున్నారు. ఇక ఈ సారి పిన్నెల్లికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి..మాచర్ల రాజకీయాల్లో బలమైన ఫ్యామిలీగా ఉన్న జూలకంటి ఫ్యామిలీ నుంచి బ్రహ్మానందరెడ్డిని మాచర్లలో అభ్యర్ధిగా పెట్టారు. మాచర్ల సీటు ఆయనకే ఫిక్స్ చేశారు.

ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా ఉన్న పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డిని టీడీపీ అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు. అభ్యర్ధిగా ఫిక్స్ చేసిన దగ్గర నుంచి చల్లా దూకుడుగా పనిచేస్తున్నారు…పెద్దిరెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అటు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోటగా ఉన్న డోన్ లో సైతం కొత్త అభ్యర్ధిని పెట్టారు. సుబ్బారెడ్డిని ఇటీవలే అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు. ఇలా వైసీపీ కంచుకోటల్లో సైకిల్ రైడర్లని ఫిక్స్ చేశారు. మరి ఈ రైడర్లు ఫ్యాన్ కు చెక్ పెడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news