RRR: ట్రిపుల్ ఆర్ మరో రికార్డ్ కొట్టింది.

-

ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా  చాటుతోంది. విడుదలకు ముందు నుంచే రికార్డుల వేటలో పడింది ట్రిపుల్. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న సినిమా కావడంతో పాటు చరణ్, ఎన్టీఆర్, అలియాభట్, అజయ్ దేవ్ గన్ ఇలా భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అంచానాలు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే వరల్డ్ వైడ్ గా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటింది ట్రిపుల్ ఆర్. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ నమోదు చేసింది. కేవలం మే 23 నుంచి మే 29 వరకు ట్రిపుల్ ఆర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో 1,83,60,000 గంటలు వీక్షించారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news