తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..రాష్ట్రంలో 13,500 టీచర్ పోస్టులు

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల పదోన్నుతల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 7 వేలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

ఎస్ జి టి లకు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం లుగా పదోన్నతులు కల్పించడంతో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6500 కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మొత్తం 13500 ఎస్జిటి పోస్టులను టిఆర్టి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news