బిచ్చగాడు హీరోకి ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు..!

-

సినీ ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు అలాగే వరుస మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం మిగిలిన వారికి ఆందోళనలు కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీకి కూడా తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఇకపోతే సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని కొట్టి.. విజయ్ ఆంటోనీకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే విజయ్ ఆంటోనీ గతంలో కూడా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ బిచ్చగాడు సినిమా తీసుకొచ్చినంత క్రేజ్ మరే సినిమా కూడా తీసుకురాలేదని చెప్పాలి.

నిజానికి విజయ్ ఆంటోనీ అంటే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ అంటే ఎవరైనా సరే వెంటనే చెప్పేస్తారు. విజయ్ ఆంటోని ఒక హీరో మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత కూడా. ఇలాంటి ఈ క్రేజీ హీరోకి తాజాగా తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే విజయ్ ఆంటోని ఇప్పుడు తన తదుపరిచిత్ర షూటింగ్లో ఉండగా అక్కడ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విజయ్ ఆంటోనీ ఇప్పుడు బిచ్చగాడు సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మలేషియాలో జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ జరుగుతుండగానే విజయ్ ఆంటోని ఆకస్మిక ప్రమాదానికి గురి అయ్యాడు.

అతడిని హుటాహుటిన చిత్ర యూనిట్ మలేషియాలోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కుదుటిగా ఉంది అని.. త్వరలో కోలుకుంటారు అని వైద్య బృందం వెల్లడించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆంటోనీ ఫ్యామిలీ మలేషియా కు ఈరోజు రాత్రి బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. బోట్ లో ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందట. వేగంగా ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి పడవని ఢీ కొట్టిందట. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news