కుప్పకూలిన టీమిండియా.. సౌతాఫ్రికా టార్గెట్‌ 149

-

కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 లో రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు బ్యాటింగ్ లో తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు మన ఆటగాళ్ల వైఫల్యంతో.. టీమిండియా భారీ స్కోరు చేయలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు తొలి ఓవర్లోనే రబాడ షాకిచ్చాడు. అతడు వేసిన మొదటి ఓవర్లో ఐదో బంతికి రుతురాజ్ గైక్వాడ్ (1) కేశవ్ మహారాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరారు. రబాడాకు ఇది టీ20 లలో 50వ వికెట్.

గైక్వాడ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 40.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 34.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. నోర్త్జ్ వేసిన నాలుగో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన కిషన్.. ప్రిటోరియస్ వేసిన ఆరో ఓవర్లో కూడా సిక్సర్ బాది జోరు మీద కనిపించాడు. షంషీ వేసిన 9వ ఓవర్లో 4,6 తో అయ్యర్ జోరుమీదున్నా.. ఆ తర్వాత ఓవర్ వేసిన కేశవ్ మహారాజ్ రిషభ్ పంత్ (5) ను ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత టీమిండియా కోలుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. 13వ ఓవర్ వేసిన పార్నెల్.. హార్దిక్ పాండ్యా (9) ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే ప్రిటోరియస్ బౌలింగ్ లో శ్రేయస్ కూడా వికెట్ కీపర్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version