న్యూజిలాండ్ పర్యటనను విజయంతో మొదలుపెట్టిన టీం ఇండియా ఓటమితో ముగించింది. టి20 సీరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన ఇండియా… ఆ తర్వాత వన్డే సీరీస్, ఇప్పుడు టెస్ట్ సీరీస్ క్లీన్ స్వీప్ తో కోల్పోయింది. రెండో టెస్ట్ లో టీం ఇండియా 7 వికెట్ల తేడా తో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.
235 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 7 పరుగుల స్వల్ప ఆధిక్యంతో బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 124 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాను జేమిసన్ దెబ్బ తీస్తే రెండో ఇన్నింగ్స్ లో బౌల్ట్ దెబ్బ తీసాడు. ఆ తర్వాత 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
టామ్ లాథమ్ (52), బ్లండెల్ (55) అర్థ సెంచరీలు చేశారు. ఐదు పరుగులు చేసిన కేన్ విలియమ్సన్‌ను బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత టైలర్ (5), నికోల్స్ (5) పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించారు. బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టి గా విఫలమైన టీం ఇండియా… సీరీస్ ని కోల్పోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఆట తీరు జట్టుని బాగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పుకోవచ్చు.