విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారతీయుడు 2. వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. ఆయన కాలుకి తీవ్ర గాయం అయింది.
ఇక అక్కడి నుంచి చిత్ర యూనిట్ ని కష్టాలు వెంటాడుతున్నాయి. బాధితుల కుటుంబాలకు హీరో కమల్ హాసన్ తలో కోటి, శంకర్ తలో కోటి ప్రకటించినా ప్రభుత్వం, పోలీసు విభాగం, దర్యాప్తు సంస్థలు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన విచారణ కీలక దశలో ఉంది. ఇప్పటికే శంకర్ ని అధికారులు విచారించారు. రేపు కమల్ హాసన్ ని విచారించడానికి నోటీసులు జారి చేసారు.
ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం రేపు విచారించనుంది. అయితే మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్, శంకర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. విచారణ ఇక నుంచి కీలక దశలో ఉండే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇటీవల శంకర్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు. దీనితో ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఉత్కంట నెలకొంది.