రోహిత్ హిట్టింగ్… కులదీప్ హ్యాట్రిక్… టీం ఇండియా ఘన విజయం…!

-

[tps_header][/tps_header]

వెస్టిండీస్ తో విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సీరీస్ 1-1తో సమం చేసింది.. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా… నిర్ణీత 50 ఓవర్లలో ఓపెనర్ల ధాటికి 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది.లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన ఓపెనర్లు… రెండో వన్డేలో మాత్రం చెలరేగిపోయారు… స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ… 138 బంతుల్లో… 5 సిక్సులు 17 ఫోర్ల సాయంతో… 159 పరుగులు చేసాడు… మరో ఓపెనర్ కెఎల్ రాహుల్… 104 బంతుల్లో 3 సిక్సులు… 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసాడు…

అయితే రాహుల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ… తొలి బంతికే చేజ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా… ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు… ఈ క్రమంలో రోహిత్ శర్మ… 159 పరుగుల వద్ద అవుట్ కాగా… క్రీజ్ లోకి వచ్చిన యువ ఆటగాడు రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 16 బంతుల్లో నాలుగు సిక్సులు మూడు ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. పంత్ ఇచ్చిన ఊపుతో అప్పటి వరకు ఆచితూచి ఆడిన శ్రేయాస్ అయ్యర్ కూడా… సిక్సుల మోత మోగించాడు.

ఇద్దరు కలిసి 22 బంతుల్లోనే 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం… భారి షాట్ కి ప్రయత్నించి పంత్ అవుట్ అయ్యాడు… తర్వాత కేదార్ జాదవ్… 10 బంతుల్లో 16 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన విండీస్ జట్టుకి ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా ఆచితూచి ఆడారు… ఓపెనర్ లేవిస్… ఠాకూర్ బౌలింగ్ లో అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా… ఆచితూచి ఆడుతున్న… శై హోప్… అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు.

తొలి వన్డేలో మెరుపు మెరిపించిన హేట్మేయర్ నాలుగు పరుగుల వద్ద రనౌట్ కావడంతో టీం ఇండియా విజయం లాంచనమే అని భావించారు అంతా… అయితే హోప్ తో కలిసి… పూరన్… సిక్సులు ఫోర్లతో భారత శిభిరాన్ని ఒత్తిడిలోకి నెట్టగా… వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని శమీ విడగొట్టాడు… ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలయింది… ఆ తర్వాత బంతి అందుకున్న… కులదీప్ యాదవ్ చెలరేగిపోయాడు… హ్యాట్రిక్ వికెట్లు తీసి… రెండు సార్లు వన్డేల్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్ గా నిలిచాడు…

33 వ ఓవర్… నాలుగో బంతికి హోప్ ని అవుట్ చేసిన యాదవ్… తర్వాతి బంతికే… హోల్డర్ ని బోల్తా కొట్టించాడు… ఆఖరి బంతికి… జోసేప్గ్ ని పెవేలియన్ చేర్చాడు.. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పోరాడినా ఓటమి అంతరాన్ని తగ్గించారే గాని జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయారు. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో… విండీస్ ఓటమి లాంచనం అయింది. 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో కులదీప్, శమీ తలో మూడు వికెట్లు తీయగా… జడేజా రెండు, ఠాకూర్ ఒక వికెట్ తీసారు. 159 పరుగులతో సత్తా చాటిన ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది… ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే కటక్ లో ఆదివారం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news