హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ‘దళితబంధు’ నిలిపివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్లకు షాక్ ఇచ్చింది. లిస్ట్ ప్రకారమే విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకూ పిటిషనర్లు ఆగాల్సిందేనని కోర్టు ఆదేశించింది. దీంతో పిటిషనర్లు డైలమాలో పడ్డారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభించేందుకు సిద్ధమైంది. అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పబట్టాయి. హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఉన్నందునే దళితులపై కేసీఆర్‌కు ప్రేమ పుట్టిందని ఆరోపిస్తున్నారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.