తెలంగాణ రాష్ట్ర అధికార భాష సంఘం తొలి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి చెందారు. 84 సంవత్సరాలు ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్ రావు తీవ్ర అనారోగ్యంతో గత నెల 31 వ తేదీన హైదర్గూడా అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ నిన్న అర్థరాత్రి తుది శ్వాస విడిచారు దేవులపల్లి ప్రభాకర్ రావు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు కు సారథ్యం వహించిన దేవులపల్లి రామానుజరావు సోదరుడు అయినా ప్రభాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా దేశాయిపేట లో 1938 లో జన్మించారు. వరంగల్ అలాగే హైదరాబాద్లో దేవులపల్లి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ లో తన డిగ్రీ పట్టాను పొందారు. 1960 నుంచి పలు తెలుగు దినపత్రికల్లో కాలమిస్టుగా పనిచేశారు. ఈయనకు భారత ప్రభుత్వం తరఫున అనేక అవార్డులు కూడా వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలోనూ చాలా చురుగ్గా పాల్గొన్నారు దేవులపల్లి ప్రభాకర్ రావు. ఇక దేవులపల్లి మృతి పట్ల తెలంగాణ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.