Breaking : ముగిసిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం

-

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. కీలకమైన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి సభను సభాధ్యక్షుడు నిరవధికంగా వాయిదా వేశారు. ఆగస్టు 3న ప్రారంభమైన సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగాయి.సీఎం ప్రసంగం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. గవర్నర్​ తిప్పి పంపిన బిల్లులకు సైతం ఆమోద ముద్ర వేశారు. వాయిదాకు ముందు ప్రజా గాయకుడు గద్దర్​సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

TS Assembly budget session from Monday, all arrangements in place-Telangana  Today

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉద్యోగులు విలీనంతో ప్రభుత్వానికి ఏటా 3 వేల కోట్ల భారం పడుతుందన్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు. మరోవైపు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news