ఇవాళే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశంలో… రాష్ట్ర బడ్జెట్ కు ఆమోద ముద్ర పడింది. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పొద్దు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇతర సంబంధించిన ప్రగతి ఇలా ఎన్నో అంశాలతో ఈ సారి బడ్జెట్ ను రూపొందించారు మంత్రి హరీష్ రావు.
ఈ ఏడాది బడ్జెట్ 2.60 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మధ్య ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగానే ఈ సారి బడ్జెట్ లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే… గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది.
కానీ ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వలో ఎలాంటి చలనం రాలేదు. ఈ పథకం ప్రకారం ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3016 ఇవ్వాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో… ఇవాళ అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ భృతి ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిజంగా ఇవాళ నిరుద్యోగ భృతి ప్రకటిస్తే.. ఏకంగా 10 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది.