తెలంగాణ ప్రభుత్వం 2022-23 బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు సమావేశాల మొదటి రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సభ సజావుగా సాగేందుకు వీలుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ శనివారం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను స్పీకర్ ఆదేశించారు. ఇది ఇలా ఉండగా.. ఈ సారి బడ్జెట్ భారీగా పెరుగనుంది. సంక్షేమ పథకాలు, ఇతర ఖర్చుల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది బడ్జెట్ 2.60 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మధ్య ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగానే ఈ సారి బడ్జెట్ లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.