తెలంగాణ కరోనా బులిటెన్ .. కొత్త కేసులెన్నంటే..?

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందళోనకు గురిచేస్తున్న కరోనా రక్కసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 7,007 కరోనా పరీక్షలు నిర్వహించగా, 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వీటిలో అత్యధికంగా ఒక్క హైదరాబాదులోనే 47 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 94 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 88 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.

Coronavirus Update, Corona in Hyderabad, Corona In Telangana, Corona In  Andhra | The Hans India

తెలంగాణలో ఇప్పటిదాకా 8,36,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,31,830 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 751 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news