యావత్తు ప్రపంచ దేశాను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా రక్కసి తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా భారీగా నమోదైన కరోనా కేసులు ఇప్పడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 14,320 శాంపిల్స్ పరీక్షించగా, 192 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 80, రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా 601 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
అదే సమయంలో 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,34,143 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,28,108 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,924 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే.. సీజనల్ వ్యాధులు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. డెంగ్యూ ఫీవర్ కేసులు జిల్లాల వారికిగా భారీగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.