వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పవన్ వల్ల జగన్‌కు ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే కొన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎంత కాదు అనుకున్న పవన్‌కు కాపులు మద్ధతు ఎక్కువే. కాపులు జనసేన వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కాపులు పవన్ వైపు ఎక్కువ రాలేదు. మెజారిటీ కాపు ఓటర్లు జగన్‌కు మద్ధతు తెలిపారు..దీంతో కాపు ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది.
అయితే కొందరు కాపులు జనసేన వైపు…కొందరు టీడీపీ వైపు వచ్చారు..అంటే ఈ రెండు పార్టీల మధ్య కాపుల ఓట్లు చీలిపోయాయి. ఇక గత ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యలో వైసీపీ వెళ్ళిన కాపులు…ఈ సారి కూడా వైసీపీ వైపు చూస్తారా ? అంటే డౌటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క కాపు నేస్తం తప్ప…కాపులకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమి లేదు…కాపు కార్పొరేషన్ ఉన్నా సరే పెద్దగా ప్రయోజనం కలగలేదు.
అదే సమయంలో కాపు ఎమ్మెల్యేలు ఉన్నా సరే…ఆయా నియోజకవర్గాల్లో కాపు వర్గానికి ఒరిగింది ఏమి కనిపించడం లేదు. పైగా పదే పదే వైసీపీ కాపు ఎమ్మెల్యేలు..తీవ్ర స్థాయిలో పవన్‌ని టార్గెట్ చేయడం కూడా కాపు శ్రేణులకు నచ్చలేదు. ఈ పరిణామాలని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో కాపులు ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
అలాగే టీడీపీకి మొదట నుంచి కొందరు కాపులు మద్ధతుగా ఉంటూ వస్తున్నారు…ఇదే క్రమంలో టీడీపీతో గాని పవన్ పొట్టుకుంటే జగన్‌కు నష్టం ఎక్కువే జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ వల్ల వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ డ్యామేజ్‌ని ముందే ఊహించి…ఇకనైనా కాపులని ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేస్తే ఎంతోకొంత వైసీపీకి బెనిఫిట్ అవుతుంది..లేదంటే రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న కాపులు దూరమవ్వాల్సిందే.