తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త.. ఇక నుంచి ఇంటికే మెడిసిన్స్ పంపిణీ

-

తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ హాలత ప్రొఫైల్ ను ప్రారంభించిన హరీష్ రావు మాట్లాడుతూ.. సంక్షేమ పతకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. మరో అద్భుత కార్యక్రమం ఈ-హెల్త్ ప్రొఫైల్ అని చెప్పారు. దేశంలో ఈ-హెల్త్ ప్రొఫైల్ ఉన్న మొట్టమొదటి జిల్లాగా దేశ ముఖచిత్రం లో ములుగు జిల్లా నిలవడం గర్వకారణమన్నారు.

భారత దేశంలో మొట్టమొదట హెల్త్ ప్రొఫైల్ ములుగు – సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించు కోవడం శుభ సూచికమని వెల్లడించారు. 40 రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసి..ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డ్ అందిస్తామని.. 197 మెడికల్ టీమ్స్ పని చేస్తాయన్నారు.

పేషెంట్ హెల్త్ హిస్టరీ తెలియడం వల్ల వారికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని.. ఇక మీదట ఇంటికే ఆశ వర్కర్ల ద్వారా మందులు ఉంటుందని ప్రకటన చేశారు. ఒక గ్రామ పంచాయతీ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడం.. కేవలం ములుగు జిల్లాకే ఆ కీర్తి దక్కిందన్నారు. గిరిజన యూనివర్సిటీ పేరుతో కేంద్రం గిరిజనులను మోసం చేస్తుందని.. కేంద్రం కనీసం గిరిజనులకు ఉన్న రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news