BREAKING : తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా..!!

-

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తడిసి ముద్దవుతో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ మరియు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అయితే..ఈ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 న ఈసెట్… ఈ నెల 14 నుంచి ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉండేది. అయితే.. భారీ వర్షాల కారణంగా.. ఈరోజు మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి అధికారుల సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా సెట్ పరీక్షల వాయిదాపై సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ సెట్ , ఎంసెట్ (అగ్రి కల్చర్ ) వాయిదా వేసినా… ఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్షలు నిర్వహించాలని అనుకుంటుంది ఉన్నత విద్యా మండలి. దీనిపై మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news