టాలీవుడ్ కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త‌…సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంపున‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా టికెట్ల ధరల పై అధికారుల కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాసేపు క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.

kcr
kcr

తెలంగాణలోని థియేటర్లలో ఏపీ థియేట‌ర్ల లో థియేట‌ర్ల‌లో రూ. 50 నుంచి రూ. 150 ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసు కున్న‌ట్లు స‌మా చారం అందుతోంది. అలాగే.. మ‌ల్టీ ప్లెక్స్ ల్లో అయితే.. 100 రూపాయ‌ల నుంచి 250 కి పెంచింది. మ‌ల్టీ ప్లెక్స్ ల‌లో రిక్లైన‌ర్ సీట్ల‌కు గ‌రిష్టంగా 300 రూపాయ‌లు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది కేసీఆర్ స‌ర్కార్‌. టికెట్ల ధ‌ర‌ల‌కు జీఎస్టీ, నిర్వ‌హ‌ణ ఛార్జీల‌ను అద‌నంగా వ‌సూలు చేయాల‌ని కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో.. నిర్వ‌హణ చార్జీల కింద ఏసీ థియేట‌ర్ల‌లో.. టికెట్ పై ఐదు రూపాయ‌లు.. నాన్ ఏసీ థియేట‌ర్ ల‌లో టికెట్ పై మూడు రూపాయ‌లు వ‌సూలు చేయ‌నున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news