మెగా హీరో పెద్ద మిస్టేక్ చేస్తున్నాడా …ఇలాంటి టైం లో ఈ రిస్క్ ఏంటీ ..?

టాలీవుడ్ లో ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా అది పనికొచ్చేది కేవలం మొదటి సినిమాకే. హీరోగా ఇండస్ట్రీలో లాంచ్ అవడం వరకే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పనికొస్తుంది. ఆ తర్వాత ఆ హీరో స్టార్ గా ఎదగాలంటే అతని కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక హీరో కెరీర్ లో ఎంత ఎత్తుకి చేరుకుంటాడు అనే విషయంలో చాలా కారణాలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో ముఖ్యమైనది మాత్రం కథల ఎంపిక..దర్శకుల ఎంపిక. ఈ రెండు విషయాలలో గనక రాంగ్ స్టెప్ వేస్తే మాత్రం స్టార్ హీరో అయినా తన కెరీర్ లో దారుణంగా దెబ్బ తినడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ విషయంలోనే రాంగ్ స్టెప్ వేస్తున్నాడని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ డైరెక్టర్ దేవా కట్టా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ షాకవడమే కాదు ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ గాను మారింది. వాస్తవంగా చూస్తే సాయి ధరమ్ తేజ్ కెరీర్ బిగినింగ్ లో సాఫీగానే సాగింది. ఇక హీరోగా స్టార్ స్టేటస్ ని అందుకుంటాడనుకునే లోపే వరుసగా అయిదు ఆరు సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. అలా వరుస ఫ్లాప్స్ తర్వాత ఆచి తూచి చేసిన చిత్రలహరి’ హిట్ అవడం తో మళ్ళీ ఫాం లోకి వచ్చాడు.

ఆ సినిమా తర్వాత వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళని సాధించి ఇక తిరుగు లేదు అనిపించింది. ప్రస్తుతం తేజు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తున్నాడు. తేజుకు సూట్ అయ్యే రొమాంటిక్ కామెడీ కావడంతో ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో దేవా కట్టాతో సినిమాకి కమిటవడం రాంగ్ స్టెప్ అని అందరూ కామెంట్ చేస్తున్నారు. దేవా కట్టా మంచి దర్శకుడే అయినప్పటికి కమర్షియల్ సక్సెస్ ను మాత్రం ఇంతవరకు సాధించుకోలేకపోయాడు దేవా కట్టా. తేజు కి ఇప్పుడిప్పుడే సక్సస్ లు వస్తూ మళ్ళీ యంగ్ హీరోలలో కాస్త పోటీగా నిలబడబోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో దేవా కట్టా సినిమా చేయడం ఎంతమాత్రం కరెక్ట్ డెసిషన్ కాదన్న వాదన గట్టిగా వినిపిస్తుంది.