తెలంగాణ టీచర్లకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఆన్లైన్ పద్ధతిలో లోపాలు, అప్ గ్రేడ్ కానీ ఆప్షన్లు, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు, ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యలపైనే ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంది.
ఈ తరుణంలోనే గడువు పొడిగింపు విషయాన్ని సోమవారం రాత్రి అధికారికంగా వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ. ఈ గడువును పిబ్రవరి 1 వ తేదీ వరకు అంటే, రేపటి వరకు పొగడించింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, టీచర్ల బదిలీలు, పదోన్నతికి సంబంధించిన షెడ్యూల్ ను కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సోమవారం ముగుస్తుంది. కానీ ఆ గడువును బుధవారం వరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పొడగించింది.