తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 18వ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరు, తదితర ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో సహా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
అయితే, జనవరి 18న రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు.. రెండో దఫా కంటి వెలుగు పథకంపై మంత్రి హరీశ్ రావు ఇవాళ వైద్యాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు ఉదయం10.30 గంటలకు MCRHRDలో జరిగే సమావేశంలో అన్ని జిల్లాల డిఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలుపాల్గొననున్నారు.