మెదక్ జిల్లాకు చెందిన ఖదీర్ ఖాన్ పోలీసుల థర్డ్ డిగ్రీ వల్లే చనిపోయాడని ఆయన భార్య ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఖదీర్ మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టింది. ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, మెదక్ డీఎస్పీ, ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది.
మెదక్ పోలీసుల దెబ్బలకు ఖదీర్ ఖాన్ మృతిచెందినట్లు ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. పత్రిక కథనాల ఆధారంగా సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు ఖదీర్ మరణించారని ఉన్నత న్యాయస్థానానికి అదనపు ఏజీ తెలిపారు. ఖదీర్ మృతికి కారణాలపై విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.