కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ముందుకెళ్లొద్దంటూ ఆదేశాలు

-

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. మాస్టర్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని నిలిపివేశామని వెల్లడించింది.

ఈ విషయమై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదు అని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్‌ప్లాన్‌పై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ కౌన్సిలర్లు ఏకవాక్య తీర్మానం చేశారు. కామారెడ్డి మాస్టర్ ​ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయం మేరకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. రైతుల భూమి సేకరించే ఉద్దేశం లేదని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news