తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఇవాళ్టి నుంచి (ఆగస్టు 1) ప్రారంభం కానున్నాయి. 2021 – 22 10వ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు.
ఆగస్టు 1 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ సంచారకుడు రామేశ్వర రావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే 9989074453 గల నెంబర్ కు సంప్రదించాలని కోరారు. అటు ఇంటర్ పరీక్షల కోసం కూడా.. ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.