హుజురాబాద్ ఎన్నిక ఎఫెక్ట్ : తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షలపై పడింది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30వ తేదీన ఉన్న నేపథ్యంలో… ఇంటర్ పరీక్షల తేదీలను మార్చేసింది ఇంటర్ బోర్డ్. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు రి షెడ్యూల్ చేసింది.

ఈ లెక్కన 29 న జరగాల్సిన పరీక్ష 31 వ తేదీకి.. 30 న జరగాల్సిన పరీక్ష నవంబర్ 1 వ తేదీ కి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలుసుకొని తెలంగాణ ఇంటర్ విద్యార్థులు అలర్ట్ కావాలని పేర్కొంది ఇంటర్ బోర్డు. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30వ తేదీన జరుగనుండగా.. నవంబర్ 3 వ తేదీన ఉప ఎన్నిక ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక నేటితో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగుసిన సంగతి తెలిసిందే.