రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి చేపట్టగానే కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం కాబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే టీజేఎస్ విలీనంపై కోదండరామ్ తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని కూడా కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. రేవంత్ సూచనతోనే గతంలో కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానిం చడానికి.. కొండా విశ్వేశ్వర రెడ్డి తో కలిసి ఈటల వద్దకు వెళ్లిన కోదండరామ్…రేవంత్ అధ్యక్షుడు అయితేనే విలీనం / పొత్తు పై ఆలోచన చేద్దామని గతంలో తన పార్టీ సహచరులతో చెప్పినట్లు సమాచారం.
ఇక రేవంత్ పీసీసీ కావడంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూరినట్లయింది. అయితే ఈ వార్తలపై తాజాగా కోదండరామ్ ఘాటుగా స్పందించారు. పార్టీ విలీనం పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తు న్నారని…. ఆ ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఇక ముందు కూడా అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు కోదండరాం.