రేపటి నుండి తెలంగాణ ఎంసెట్ : ఈ రూల్స్ పాటించాల్సిందే

-

రేపటి నుండి తెలంగాణ ఎంసెట్ ప్రారంభం కానున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ పేర్కొన్నారు. గత ఏడాది కన్నా 28 వేల మంది ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారని.. ఏపీ నుండి 50 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకి అన్ని సెట్స్ అయ్యిపోయాక పరీక్ష నిర్వస్తామని.. ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని తెలిపారు.

ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష సెంటర్ లోకి నో ఎంట్రీ అని పేర్కొన్న ఆయన.. విద్యార్ధులు మాస్కు లు ధరించి రావాలన్నారు. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని.. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉందని.. మొత్తం 6 సెషన్స్ ఉంటాయని పేర్కొన్నారు.

9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ … 3 సెషన్స్ ఉంటాయని.. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మొత్తం 105 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇందులో తెలంగాణ లో 82, ఆంధ్ర లో 23 ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు పెరిగిన నేపథ్యంలో సెంటర్లు, సెషన్స్ పెంచామన్నారు. ఈ పరిక్షల ఫలితాలు 15 రోజుల్లో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news