మరోసారి తెలంగాణపై మోదీ వివక్ష రుజువైంది… కేటీఆర్ ట్వీట్

-

ట్విట్టర్ లో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం, ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. సంప్రదాయ వైద్య కేంద్రంపై గతంలో కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ… తెలంగాణపై కేంద్రం వివక్షత గురించి ప్రస్తావించారు. 

రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం యథావిధిగా గుజరాత్ తరలిపోయిందని మండిపడ్డారు. కేంద్రం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు అన్యాయం జరిగింది కేటీఆర్ అన్నారు. ఐఐఎస్ఈఆర్ లు 2 కేటాయిస్తే తెలంగాణకు ఏం ఇవ్వలేదని అన్నారు. 16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్ ఐడీలు 4, మెడికల్ కాలేజీలు 157 కేటాయిస్తే ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని… ఇలాగే 84 నవోదయాల్లో తెలంగాణకు ఒక్కటీ కూడా ఇవ్వలేదని ట్విట్ చేశారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ హామీని కేంద్రం విస్మరించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news