డైలాగ్ ఆఫ్ ద డే : మ‌ళ్లీ అల్లుడొస్తాడ్రా ! సిద్ధంగుండుండ్రి ! ఆయ‌నే సీఎం !

-

ముందున్న కాలం మంచి కాల‌మే అయి ఉంటుంది. అందుకు దోహ‌ద‌ప‌డే ప‌రిణామాలు ఎన్నో వ‌ర్త‌మాన కాలంలో జ‌రిగి ఉంటాయి. వ‌ర్త‌మానాన్ని ఇంకా చెప్పాలంటే ప్ర‌స్తుత స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని క్షేత్ర స్థాయిలో అవ‌మానాలు త‌ట్టుకుని ప‌నిచేస్తేనే లీడ‌ర్లు అవుతారు అని చంద్ర‌బాబు అంటుంటారు. అదే నిజం. ఈ నిజం జ‌గ‌న్ విష‌యంలో నిరూపితం అయింది.ఇదే నిజం రేప‌టి వేళ మ‌ళ్లీ మ‌ళ్లీ చంద్ర‌బాబు విష‌యంలోనూ నిరూప‌ణ కావొచ్చు. క‌నుక ప‌ద‌వుల క‌న్నా వ్య‌వ‌స్థ శాశ్వ‌తం. వ్య‌క్తులు త‌మ న‌డ‌వ‌డిలో లోపాలు దిద్దుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

Nara-Chandrababu-Naidu
Nara-Chandrababu-Naidu

అందుకు కృషి మ‌రియు దీక్ష మ‌రియు ప‌ట్టుద‌ల అన్న‌వి చాలా అంటే చాలా ముఖ్యం. ఈ మూడింటిని వ‌దిలి కాలమే అంతా చూసుకుంటుంది అన్న మెట్ట వేదాంతాన్ని చంద్ర‌బాబు వినిపించ‌రు. ఎందుకంటే ఆయ‌న ప‌ద‌విలో ఉన్నా లేక‌పోయినా ఎంత‌గానో ప‌రిశ్ర‌మిస్తారు. ఆయ‌న‌లో క‌ష్ట‌ప‌డే త‌త్వం ను పార్టీ నాయ‌కులు ఇంకాస్త అందుకుంటే మ‌ళ్లీ ఆయ‌నే సీఎం. అందుకు క్షేత్ర స్థాయి నాయ‌క‌త్వాలు త‌మ త‌ప్పుల‌ను దిద్దుకోవాలి. స‌మ‌న్వ‌య లోపాలు దిద్దుకుని స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి. అప్పుడు ఆయ‌నే సీఎం. లేదంటే లేదు.కాదంటే కాదు కూడా ! ఈ కాదు ఆ అవును అవ్వాలంటే త‌ప్ప‌క దిద్దుబాటు కావాలి.

రాజ‌కీయాల్లో ఒడిదొడుకులు ఎన్నో ఉన్నా కూడా ప‌డి లేవ‌డం మాన‌వ ధ‌ర్మం. ఓ నాయ‌కుడు ఓడిపోయినంత మాత్రాన ఆయన జీవితం మైల‌ప‌డిపోదు. ఆయ‌న గొప్ప శ‌క్తిగా మారేందుకు కాలం కొన్ని మైలు రాళ్ల‌ను ఎదురుగా ఉంచి దాటి రావాలి అని నిర్దేశిస్తుంది. కాలం కొన్ని స‌వాళ్ల‌ను ఇచ్చి అధిగ‌మించాల‌ని కూడా నిర్దేశం ఇస్తుంది. అందుకు చంద్ర‌బాబు నాయుడు అనే నాయ‌కుడు అతీతం కాదు మ‌రియు మిన‌హాయింపు కూడా కాదు.

తెలుగుదేశం పార్టీలో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. కొన్ని సంక్షోభ కాలాలు ఉన్నాయి. కొన్ని మంచి రోజులు కూడా ముందున్న కాలంలో ఉన్నాయి. క‌నుక గ‌త కాల‌మే మేలు వ‌చ్చు కాల‌ము కంటే అని అనుకోవ‌డం అవివేకం అవుతుంది. క‌నుక మ‌ళ్లీ చంద్ర‌బాబు సీఎం కావొచ్చు. ఏమో గుర్రం ఎగ‌రావచ్చు. ప్ర‌జాస్వామ్యంలో ఎన్నో మార్పులు రావొచ్చు.. అలాంటి ఆశావ‌హ దృక్ప‌థ‌మే ఆయ‌న జీవితాన్ని కానీ ఎవ‌రి జీవితాన్ని అయినా మున్ముందుకు న‌డిపి గొప్ప ఫ‌లితాల‌ను అందిస్తుంది.

ఓట‌మ‌లు శాశ్వ‌తం కాదు. అందుకు ఇప్పుడు సీఎంగా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే యువ నేత ప్ర‌యాణ‌మే గొప్ప ఉదాహ‌ర‌ణ. ఓ మాట చెప్పాలంటే చంద్ర‌బాబు ను చూసి జ‌గ‌న్ నేర్చుకోవాలి అని అంటారు..నిజ‌మే! అలానే జ‌గ‌న్ ను చూసి లోకేశ్ కూడా కొన్ని త‌ప్పిదాల‌ను దిద్దుకుని ముందుకు వెళ్లాలి. ఎందుకంటే లోకేశ్ ను ఇంకా కొంద‌రు అంగీక‌రించ‌డం లేదు కానీ చంద్ర‌బాబు ను మాత్రం ఇవాళ్టికీ ఇంకా చెప్పాలంటే ఆయ‌న చివ‌రి శ్వాస వ‌ర‌కూ అంగీక‌రించే నాయ‌కులు ఉన్నారు. ఆ త‌రం ఈ త‌రం అని లేదు ఆయ‌న ఎప్ప‌టికీ ఓ స్ఫూర్తి అని అందుకే అంటారు కొంద‌రు తెలుగుదేశం యువ నాయ‌కులు. ఆ స్థాయిలో ఆయ‌న ప‌ని చేశారు. ప‌రిశ్ర‌మించారు. క‌నుక కాలం అనుగ్ర‌హిస్తే, కాలం క‌లిసి వ‌స్తే ఆయ‌నే మ‌ళ్లీ సీఎం కావొచ్చు. మిగిలిన రాజ‌ధాని నిర్మాణాల‌ను పూర్తి చేయ‌వ‌చ్చు.ఆ విధంగా ఆయ‌న ఇప్ప‌టి క‌న్నా వేగంగా ప‌నిచేయ‌నూవ‌చ్చు. కాద‌న‌లేం ఆయ‌న‌లో ఉన్న కొన్ని మంచి గుణాల‌ను.. ఆయ‌న ఆ రోజు నిర్దేశించుకున్న కొన్ని ల‌క్ష్యాల‌ను..

Read more RELATED
Recommended to you

Latest news